Advertisement

కొవిడ్‌ నిబంధనలతో గణతంత్ర వేడుకలు నిర్వహించాలి

Jan 24 2021 @ 00:20AM
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు


  • కలెక్టర్‌ పౌసుమి బసు 
  • అధికారులతో సమీక్ష సమావేశం

వికారాబాద్‌: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఎస్పీ నారాయణ, అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌తో కలసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. 26న ఉదయం 9గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో పతాకావిష్కరణ నిర్వహించడం జరుగుతుందని, అంతకుముందే అధికారులు తమ కార్యాలయాల వద్ద పతాకావిష్కరణ నిర్వహించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ జెండాలు వినియోగించకుండా, దుకాణాలలో విక్రయించకుండా చూడాలని కమిషనర్‌ను ఆదేశించారు. కరోనా దృష్ట్యా వృద్ధులు, పిల్లలను వేడుకల్లో అనుమతించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే వారందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో కృష్ణన్‌, డీఎ్‌ఫవో వేణుమాధవ్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్‌ కార్యాలయ ఏవో హరిత,మునిసిపల్‌ కమిషన ర్‌ భోగేశ్వర్లు, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  • యాసంగి పంటల మార్కెటింగ్‌కు ముందస్తు చర్యలు చేపట్టాలి

జిల్లాలోని 10 మార్కెట్‌ యార్డుల్లో యాసంగి పంటల మార్కెటింగ్‌కు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పౌసుమిబసు అధికారులను ఆదేశించారు. శనివారం మార్కెటింగ్‌, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో యాసంగి దిగుబడి అంచనా, మార్కెటింగ్‌పై స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2021 యాసంగిలో జిల్లాలో దాదాపు 150312 మెట్రిక్‌ టన్నుల వరి పంట దిగుబడి కానుందని, అందుకు తగ్గట్టు మార్కెటింగ్‌ యార్డులకు వచ్చే రైతులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. యార్డుల వద్ద రైతులకు వెయిట్‌ బ్రిడ్జి, తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, జనరేటర్‌, రైతులకు విశ్రాంతి గదులు, బయోమెట్రిక్‌, పెద్ద సైజు టీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని విధాల సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, వ్యవసాయశాఖ ఏడీ రమాదేవి, మార్కెటింగ్‌ అధికారి సబిత, డీఎస్‌ వో రాజేశ్వర్‌, డీఎం సివిల్‌ సప్లయ్‌ అధికారి విమల, హార్టికల్చర్‌, మా ర్క్‌ ఫెడ్‌ అధికారులు, మార్కెట్‌ కార్యదర్శులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement