వైభవంగా మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-03T04:58:30+05:30 IST

వైభవంగా మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు

వైభవంగా మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు
గణపతి హోమంలో పాల్గొన్న తహసీల్దార్‌ జ్యోతిఆరుణ్‌ తదితరులు

  • కనుల పండువగా పుష్ప రథోత్సవం 

కడ్తాల్‌ : మండలంలోని మైసిగండి మైసమ్మ దేవత వార్షిక బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం ప్రముఖ వేదపండితుడు కొడగండ్ల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో అర్చకులు  ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సుదర్శన, లక్ష్మీ, గణపతి హోమం, పారాయణం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హోమంలో మహేశ్వరం తహసీల్దార్‌ ఆర్‌.పి.జ్యోతిఅరుణ్‌, గిరిజన సేవా సంఘం రాష్ట్ర నాయకుడు జటావత్‌ జవహర్‌లాల్‌ ప్రేమ, టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌పద్మశ్రీ, లయన్స్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాముశ్వేత, యువజన సంఘాల కన్వీనర్‌ రాఘవేందర్‌, పూల శంకర్‌, అమృనాయక్‌,శ్రీరాములు గౌడ్‌  దంపతులు,  ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రామావత్‌ సిరోలి, ఈవో స్నేహలత పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మైసమ్మ తల్లీ మమ్మల్ని దీవించంటూ భక్తులు అమ్మవారికి ముడుపులు చెల్లించుకున్నారు. అనంతరం బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తులసీరామ్‌నాయక్‌, పాండు నాయక్‌, రామావత్‌ భాస్కర్‌, పంత్య తదితరులు పాల్గొన్నారు. 


ఘనంగా పుష్పరథోత్సవం.


మైసిగండి మైసమ్మ అమ్మవారి పుష్ప రథోత్సవ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. చిన్నతేరు కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి ఆలయ ఆవరణలో భక్తులు రథాన్ని లాగారు. సుమారు రెండు గంటల పాటు రథోత్సవం కనులపండువగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆమనగల్లు సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ సుందరయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-12-03T04:58:30+05:30 IST