మజ్జిగ చారు

ABN , First Publish Date - 2021-06-12T21:46:49+05:30 IST

ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. మజ్జిగచారు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్‌ లభిస్తాయి. ఇందులో ఉండే పసుపు, ఇంగువ, ఆవపిండి, మెంతులు జీర్ణశక్తిని,

మజ్జిగ చారు

ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. మజ్జిగచారు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్‌ లభిస్తాయి. ఇందులో ఉండే పసుపు, ఇంగువ, ఆవపిండి, మెంతులు జీర్ణశక్తిని, రోగనిరోధకశక్తిని పెంచుతాయి. తద్వారా ఈ కాలంలో వచ్చే బ్యాక్టీరియల్‌, వైరల్‌, ప్రోటోజువల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి తట్టుకునే శక్తిని పొందవచ్చు.


కావలసినవి: మజ్జిగ - ఒక లీటరు, ఆవపిండి - ఒక స్పూను, పసుపు - ఒక టీస్పూను, ఇంగువ - అర టీస్పూను, పచ్చిమిరపకాయలు - నాలుగు, ఎండుమిరపకాయలు - రెండు, మెంతులు - ఒక టీస్పూను, ఆవాలు - ఒక టీస్పూను, జీలకర్ర - ఒక టీస్పూను, కరివేపాకు - కొద్దిగా, దొడ్డు ఉప్పు - తగినంత.


తయారీ విధానం: ఒక పాత్రలో కొద్దిగా మజ్జిగ తీసుకుని అందులో ఆవపిండి, పసుపు, ఇంగువ, ఉప్పు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇలా కలిపిన మజ్జిగకు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్‌పై పాత్రను పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక మెంతులు, ఆవాలు వేయాలి. అవి వేగిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. తరువాత కరివేపాకు వేసి తాలింపును మజ్జిగలో కలపాలి. నూనెలో వేయించిన సగ్గుబియ్యం కూడా కలుపుకోవచ్చు. ఉల్లిపాయలను ఇష్టపడే వారు పచ్చి ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చు.

Updated Date - 2021-06-12T21:46:49+05:30 IST