మజ్జిగ వడలు

ABN , First Publish Date - 2020-12-18T19:26:43+05:30 IST

అటుకులు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - అర కప్పు, మజ్జిగ - ఒక కప్పు, పచ్చిమిర్చి, అల్లం తరుగు - ఒక టీ స్పూను చొప్పున, చిల్లీ ఫ్లేక్స్‌ - ఒక టీ స్పూను, నువ్వులు

మజ్జిగ వడలు

కావలసిన పదార్థాలు: అటుకులు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - అర కప్పు, మజ్జిగ - ఒక కప్పు, పచ్చిమిర్చి, అల్లం తరుగు - ఒక టీ స్పూను చొప్పున, చిల్లీ ఫ్లేక్స్‌ - ఒక టీ స్పూను, నువ్వులు - ఒక టేబుల్‌ స్పూను, కరివేపాకు, కొత్తిమీర తరుగు - పావుకప్పు చొప్పున, జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూను, బియ్యప్పిండి - పావు కప్పు, నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి, కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు.


తయారుచేసే విధానం: మిక్సింగ్‌ బౌల్‌లో తడిపిన అటుకులు, రవ్వ, ఉప్పు, మజ్జిగ కలిపి 20 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి బాగా కలిపి ముద్ద చేయాలి. చిన్న చిన్న ఉండలు చేసుకుని వడలుగా ఒత్తి నూనెలో దోరగా వేగించాలి. వీటికి టమోటా సాస్‌ మంచి కాంబినేషన్‌.



Updated Date - 2020-12-18T19:26:43+05:30 IST