దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తథ్యం

ABN , First Publish Date - 2022-10-08T04:55:34+05:30 IST

బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు భారత రాజకీయాల్లో

దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తథ్యం
మంత్రి కేటీఆర్‌తో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, అక్టోబరు 7: బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది అని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను శుక్రవారం ప్రగతిభవన్‌లో ఎంపీ, ఎమ్మెల్సీ మర్యాదపూర్వకంగా కలిశారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని కేటీఆర్‌ సూచించినట్లు వారు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. బీఆర్‌ఎ్‌సతో దేశరాజకీయాల్లో ఇకపై పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయని ఆయన అన్నారు. దేశప్రగతిని కాంక్షించి టీఆర్‌ఎ్‌సను సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎ్‌సగా ప్రకటించడం హర్షదాయకమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ జాతీయ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అందుకే టీఆర్‌ఎ్‌సను జాతీయ పార్టీగా చేస్తూ బీఆర్‌ఎ్‌సగా మార్చినట్లు ఆయన తెలిపారు. బీజేపీ అధికారాన్ని కాపాడుకోవడానికి, ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది తప్ప.. ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ సంకల్పించారని తెలిపారు. ఆయన సంకల్పం అనతి కాలంలోనే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కేసీఆర్‌ నాయకత్వం అందుకు అవసరమని భావిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీఆర్‌ఎ్‌సకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.  



Updated Date - 2022-10-08T04:55:34+05:30 IST