ltrScrptTheme3

త్వరలోనే ‘మేజర్’ విడుదల తేదీ ప్రకటన

Oct 26 2021 @ 14:08PM

అడివి శేష్ హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ బయోపిక్ ‘మేజర్’. కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది.  డెంగ్యూ ఫీవర్ తో బాధపడిన శేష్..  కొద్దిరోజుల క్రితం కోలుకొని తిరిగి మేజర్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేసి ఫైనల్ షెడ్యూల్ కు రెడీ అయిన ఆయన.. ఆ సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 26/11 అటాక్స్ తన ప్రాణాలను పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ఈ షెడ్యూల్ పూర్తయ్యాకా తాను తిరిగి మేజర్ కు ఫ్యాన్ గా ఉంటానని శేష్ తెలిపారు. 



సోనీ పిక్చర్స్, జీయంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘మేజర్’ ప్రాజెక్ట్ ను సెట్ చేయడానికి శేష్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల్ని స్వయంగా కలిసి.. వారి అనుమతి తీసుకొని మరీ ఈ సినిమాను పట్టాలెక్కించారు. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ , రేవతి, మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల గురించి ప్రకటన వెలుడుతుంది. దాని కోసం మంచి డేట్ చూస్తున్నారు మేకర్స్. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘మేజర్’ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీ కానున్నది. మరి ఈ సినిమాతో శేష్ ప్రేక్షకుల్ని ఎంత ఎమోషనల్ గా కదిలిస్తారో చూడాలి.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.