ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దాలి

Sep 17 2021 @ 23:12PM
మొక్క నాటి మట్టి పోస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


- ఆబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌


మహబూబ్‌నగర్‌, సె ప్టెంబరు 17 : ప్రధాన రహదారులను సంద రంగా తీర్చిదిద్దాలని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌న గర్‌ జిల్లాకు రాగానే ప్ర త్యేక వాతావరణం కని పించేలా పట్టణానికి వ చ్చే అన్ని ప్రధాన రహ దారులకు ఇరువైపుల, రహదారి మధ్యలో డివైడర్లపై పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. జడ్చర్ల- మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారి మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అడిసినల్‌ కలెక్టర్‌ తేజస్‌నం దలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, ముని సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సన్మానం


హన్వాడ : మద్యం షాపుల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించినందుకు పలువురు ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనువాస్‌గౌడ్‌ను సన్మానించారు. శుక్రవారం హైదారాబాద్‌ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా డైరెక్టర్‌ కొండ లక్ష్మయ్య, ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జంబులయ్య, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు చెన్నయ్య, సర్పం చులు, ఎమ్మార్పీఎస్‌, టీఅర్‌ఎస్‌ నాయకులు బాలకిష్టయ్య, జోగు వాసు, బసిరెడ్డి, చెన్నయ్య, శ్రీను మంత్రిని సన్మానించారు.


బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం


మహబూబ్‌నగర్‌ :  వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన నాగరాజు కుటుంబ సభ్యులను శుక్రవారం కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.25 వేల చెక్కును వారికి అందజేశారు. ఎదిరకు చెందిన నాగరాజు రెండ్రోజుల క్రితం మరణించాడు. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. 

Follow Us on: