మహాకూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ అభ్యర్థి గెలుపు

ABN , First Publish Date - 2021-12-14T17:02:03+05:30 IST

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (మహాకూటమి) ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

మహాకూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ అభ్యర్థి గెలుపు

ముంబై: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (మహాకూటమి) ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నాగపూర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ బవాంకులే గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి మంగేష్ దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. తొలి ప్రాధాన్యతా ఓటుగా బవాంకులేకు 362 ఓట్లు రాగా, దేశ్‌ముఖ్‌కు 186 ఓట్లు పోలయ్యాయి. డాక్టర్ రవీంద్ర భోయర్‌కు ఒక్క ఓటు వచ్చింది. కాగా, అకోలా బుల్దానా వశిం లోకల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఖండేల్వాల్ శివసేన అభ్యర్థి గోపీకృష్ణ బజోరియాను 109 ఓట్ల తేడాతో ఓడించారు. మంగళవారం వెలువడిన ఫలితాలతో బీజేపీ 4 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, శివసేన చెరొకటి దక్కించుకున్నాయి.


ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మహావికాశ్ అఘాడికి ఎదురుదెబ్బగానే చెప్పాలి. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఆరు స్థానాల్లో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ పైచేయి సాధించింది. ఇంతకుముందు, ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, శివసేన, కాంగ్రెస్ నుంచి చెరొకరు పోటీ లేకుండానే గెలుపొందారు.

Updated Date - 2021-12-14T17:02:03+05:30 IST