వైభవంగా మకరజ్యోతి దర్శనం

ABN , First Publish Date - 2021-01-16T05:22:24+05:30 IST

సంపత్‌నగర్‌ శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామి ఆలయంలో క్రేన్‌ రిలీజియన్‌ ట్రస్టు చైర్మన్‌ గ్రంధి వెంకట సత్య వెంకట లక్ష్మీ కాంతారావు, లక్ష్మీ హైమావతి దంపతుల ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా కర్పూర మకరజ్యోతి కార్యక్రమం జరిగింది.

వైభవంగా మకరజ్యోతి దర్శనం
సంపత్‌నగర్‌ అయ్యప్పస్వామి ఆలయంలో కర్పూరజ్యోతిని వెలిగిస్తున్న గ్రంఽధి కాంతారావు

గుంటూరు(సాంస్కృతికం), జనవరి15: సంపత్‌నగర్‌ శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామి ఆలయంలో క్రేన్‌ రిలీజియన్‌ ట్రస్టు చైర్మన్‌ గ్రంధి వెంకట సత్య వెంకట లక్ష్మీ కాంతారావు, లక్ష్మీ హైమావతి దంపతుల ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా కర్పూర మకరజ్యోతి కార్యక్రమం జరిగింది. 50 కేజీల కర్పూర జ్యోతిని క్రేన్‌ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు వెలిగించారు. తొలుత క్రేన్‌ కంపెనీ నుంచి స్వామి వారి ఆభరణాలను ఊరేగింపుగా ఆలయానికి తెచ్చి స్వామివారికి అలంకరించారు. భక్తిరంజని కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది.  


స్థానిక బృందావన్‌గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ - లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో మకరజ్యోతి కార్యక్రమం జరిగింది. విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య దంపతులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ కర్పూర జ్యోతిని వెలిగించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌ మస్తానయ్య, ఊటుకూరి నాగేశ్వరరావు, జూపిటర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.


మల్లారెడ్డినగర్‌ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మెట్టు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కర్పూర మకరజ్యోతి కార్యక్రమం జరిగింది.  మిర్చియార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి జ్యోతిని వెలిగించారు. భక్తులు కర్పూరజ్యోతిని దర్శించుకున్నారు. 


Updated Date - 2021-01-16T05:22:24+05:30 IST