పిల్లి బొమ్మ తయారుచేద్దామా!

ABN , First Publish Date - 2022-06-13T08:38:27+05:30 IST

ఆరెంజ్‌ కలర్‌ ఫోమ్‌ షీట్‌పై పెన్సిల్‌తో పిల్లి బొమ్మ అవుట్‌లైన్‌ గీసి కత్తిరించండి. ఇప్పుడు పసుపు రంగు షీట్‌ను తీసుకుని బొమ్మలో చూపించిన విధంగా చెవులు, మీసాలు, జుట్టు అవుట్‌లైన్‌ గీసి కత్తిరించండి.

పిల్లి బొమ్మ తయారుచేద్దామా!

కావలసినవి

ఆరెంజ్‌ కలర్‌ ఫోమ్‌ షీట్లు - రెండు, పసుపు రంగు ఫోమ్‌ షీట్‌ - ఒకటి, పింక్‌ కలర్‌ ఫోమ్‌ షీట్‌ - ఒకటి, కత్తెర, పెన్సిల్‌, జిగురు, బ్లాక్‌ స్కెచ్‌.


ఇలా చేయాలి

  • ఆరెంజ్‌ కలర్‌ ఫోమ్‌ షీట్‌పై పెన్సిల్‌తో పిల్లి బొమ్మ అవుట్‌లైన్‌ గీసి కత్తిరించండి. 
  • ఇప్పుడు పసుపు రంగు షీట్‌ను తీసుకుని బొమ్మలో చూపించిన విధంగా చెవులు, మీసాలు, జుట్టు అవుట్‌లైన్‌ గీసి కత్తిరించండి.
  • కత్తిరించిన పసుపు రంగు షీట్‌ను ఆరెంజ్‌ కలర్‌ షీట్‌ పైభాగంలో అతికించండి. మరొక ఆరెంజ్‌ షీట్‌ను వెనకభాగంలో అంటించండి. 
  • పింక్‌ షీట్‌ను తీసుకుని మూడు చిన్న వృత్తాల అవుట్‌లైన్‌ గీసి కత్తిరించండి. వాటిలో ఒకటి ముక్కుగా అంటించండి. మిగతా రెండు చెంపలపై అతికించండి.
  • బ్లాక్‌ స్కెచ్‌తో నోరు, కళ్లు గీయండి. కళ్ల మధ్యలో కొద్దిగా తెలుపు రంగు వేస్తే పిల్లి బొమ్మ రెడీ. 

Updated Date - 2022-06-13T08:38:27+05:30 IST