ఈ చిన్న చిట్కాతో కరోనా కొరతకు చెక్..

ABN , First Publish Date - 2021-06-17T05:24:15+05:30 IST

దేశంలో నెలకొన్న టీకా కొరతను అధికమించేందుకు ఓ ముఖ్యమైన మార్గముందని నిపుణులు చెబుతున్నారు.

ఈ చిన్న చిట్కాతో కరోనా కొరతకు చెక్..

న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న టీకా కొరతను అధికమించేందుకు ఓ ముఖ్యమైన మార్గముందని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఇచ్చే టీకా మోతాదును తగ్గించడం ద్వారా ఒక్క డోసును ఏకంగా ఐదు మందికి ఇవ్వచ్చని వారు చెబుతున్నారు. ఇందుకు కోసం టీకా ఇంజెక్షన్‌ను కండలోకి ఇచ్చే బదులు చర్మానికి ఇవ్వాలిన వారు చెబుతున్నారు. చర్మంలోని కణజాలానికి ఉండే ప్రత్యేక లక్షణాల కారణంగా టీకా ప్రభావశీలత పెరుగుతుందని వారు అంటున్నారు. ఈ టెక్నిక్‌ను గతంలో రేబీస్, టీబీ టీకాలు వేసే సమయంలో అమలు చేసి మంచి ఫలితాలు సాధించారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో డోసు కింద ప్రతి వ్యక్తికీ 0.5 ఎమ్‌ఎల్‌ను ఇస్తున్నారు. దీనికి బదులు కేవలం 0.1 ఎమ్ఎల్ టీకాను నేరుగా చర్మంలోకి ఇస్తే మంచి ఫలితాలు రావడంతో పాటూ టీకా కొరతకు కూడా చెక్ పెట్టొచ్చని వారు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-06-17T05:24:15+05:30 IST