సింహం బొమ్మ!

ABN , First Publish Date - 2021-06-14T05:51:10+05:30 IST

తెల్లకాగితంను సగానికి మడిచి బొమ్మలో చూపించిన విధంగా సింహం శరీరం డ్రా చేయాలి. తరువాత కత్తెర సహాయంతో కత్తిరించాలి. ఆ భాగానికి ఎరుపు రంగు వేయాలి...

సింహం బొమ్మ!

కావలసినవి

ఏ4 సైజు తెల్లకాగితం, కలర్‌ పెన్సిళ్లు, జిగురు, కత్తెర.


ఇలా చేయాలి...

  1. తెల్లకాగితంను సగానికి మడిచి బొమ్మలో చూపించిన విధంగా సింహం శరీరం డ్రా చేయాలి. తరువాత కత్తెర సహాయంతో కత్తిరించాలి. ఆ భాగానికి ఎరుపు రంగు వేయాలి. 
  2. 3వ నంబరు బొమ్మలో చూపించిన విధంగా బౌల్‌ ఆకారంలో పేపరును కత్తిరించాలి. తరువాత పసుపు రంగు వేయాలి. కళ్లు, ముక్కు భాగాలను తెలుపు రంగుతో వేయాలి. నలుపు రంగు పెన్సిల్‌ సహాయంతో కళ్లు, ముక్కు అవుట్‌లైన్‌ గీయాలి. దీంతో తలభాగం సిద్ధం.
  3. జూలు కోసం పేపరును పొడవుగా, చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. వాటికి పసుపు రంగు వేయాలి. తరువాత తల భాగానికి అతికించాలి.
  4. తోక కోసం పేపరును పొడవుగా కత్తిరించి నలుపు రంగు వేసి అతికిస్తే సింహం బొమ్మ రెడీ.

Updated Date - 2021-06-14T05:51:10+05:30 IST