నీరు నిలువ లేకుండా చూసుకోవాలి

ABN , First Publish Date - 2020-07-06T10:10:56+05:30 IST

ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిలువ లేకుండా చూసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు

నీరు నిలువ లేకుండా చూసుకోవాలి

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిలువ లేకుండా చూసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం పది గంటలకు, 10నిమిషాల పాటు మొక్కల కుండీల్లో నిలువ ఉన్న నీటిని ఆమె తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బండాలు, కాఫీ, టీ కోసం వాడేసిన కప్పులు, పాత కూలర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, గుంతల్లో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.


పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 

మేడ్చల్‌/కీసర రూరల్‌: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం పది గంటలకు. పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో మొక్కలపై ఎండిన ఆకులను ఆయన తొలగించారు. అనంతరం ఇంటి పరిసరాలను ఆయన శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


పరిశుభ్రతతోనే అంటువ్యాధుల నియంత్రణ

పరిశుభ్రతతోనే అంటువ్యాధుల నియంత్రణ సాధ్యమని దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రణీత అన్నారు. ఆదివారం పదిగంటలకు, పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వీధుల్లో మురుగు కాలువలను ఆమె శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. 

Updated Date - 2020-07-06T10:10:56+05:30 IST