బంద్‌ విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-03-03T05:44:48+05:30 IST

రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని తెర్లాం మండల హమాళీల యూనియన్‌ నాయకులు సీహెచ్‌ రామారావు, పి.ఆనంద్‌, బాలరాజు, గ్రీన్‌ అంబాసిడర్ల సంఘం అధ్యక్షుడు రామారావు కోరారు. ఈ మేరకు మంగళవారం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు.

బంద్‌ విజయవంతం చేయండి
బొబ్బిలిలో వాల్‌పోస్టర్లు విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

విశాఖ ఉక్కు  పరిశ్రమ ప్రైవేటీకరణపై 5న ఆందోళన

మద్దతుగా నిలిచిన వివిధ ప్రజా సంఘాలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 5న రాష్ట్ర బంద్‌కు ప్రజా సంఘాల పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను వివిధ ప్రజా సంఘాలు విడుదల చేశాయి. 


విజయనగరం దాసన్నపేట, మార్చి 2 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు ఏఐఎఫ్‌టీయూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి నారాయణరావు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు రెడ్డి తెలిపారు. మంగళవారం కన్యకాపరమేశ్వరి ఆలయ సమీపంలో యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకైన విశాఖ ఉక్కును పోస్కోకు కట్టబెట్టే నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక వైపు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల భారాన్ని సామాన్య ప్రజలపై  వేశారన్నారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 5న చేపట్టనున్న బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు గిరిప్రసాద్‌, సత్యారావు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. 


గజపతినగరంలో...

గజపతినగరం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభు త్వం తీసుకుంటున్న  చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 5న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆల్తి అప్పలనాయుడు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి కోరారు. మంగళవారం సీపీఐ  కార్యాలయంలో బంద్‌కు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, సీపీఐ ఏరియా కార్యదర్శి ఎం.శ్రీనివాస రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.పైడిపినాయుడు తదితరులు పాల్గొన్నారు.


బొబ్బిలిలో...

బొబ్బిలి (రామభద్రపురం) : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈ నెల 5న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాల ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రవి, సురేష్‌ పిలుపునిచ్చారు. మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. అలాగే విద్యార్థులకు బకాయి ఉన్న ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యా వ్యవస్థకు నష్టం తెచ్చే విద్యా సంస్కరణలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు అప్పన్న, భాస్కరరావు, లవ్‌కుమార్‌, కైలాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

తెర్లాంలో...

తెర్లాం : రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని తెర్లాం మండల హమాళీల యూనియన్‌ నాయకులు సీహెచ్‌ రామారావు, పి.ఆనంద్‌, బాలరాజు, గ్రీన్‌ అంబాసిడర్ల సంఘం అధ్యక్షుడు రామారావు కోరారు. ఈ మేరకు మంగళవారం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. అమలు చేయని హామీలు, ఇప్పుడు విశాఖ స్టీల్‌ పరిశ్రమను ప్రైవేట్‌ పరం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలతో ఆంధ్రులకు బీజేపీ తీరని ద్రోహం చేసిందని  మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 5న రాష్ట్రబంద్‌కు అందరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు.  

మక్కువలో...

మక్కువ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. స్థానిక ఎస్‌ఎన్‌ పాఠశాలలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, సీఐటీయూ నాయకులు శ్రీనివాసరావు, సీపీఎం మండల కార్యదర్శి చింతల తవిటినాయుడు పాల్గొన్నారు. 

బెలగాం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 5న చేపట్టబోయే బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు కోరారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో పోస్టర్లను విడుదల చేశారు.  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.నరేష్‌, పి.రాజశేఖర్‌, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు  పాల్గొన్నారు.


పాచిపెంటలో...

పాచిపెంట : విశాఖ ఉక్కు రక్షణ కోసం ఈ నెల 5న నిర్వహించే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నాయకులు కోరాడ ఈశ్వరరావు, షేక్‌ సుభానీ కోరారు. మంగళవారం పాచిపెంటలో కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు విశాఖ ఉక్కు పోరాటకులు పాల్గొన్నారు.


నెల్లిమర్లలో...

నెల్లిమర్ల : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షించాలని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల  5న చేపట్టే బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకుడు కిల్లంపల్లి రామారావు కోరారు. మంగళవారం జరజాపుపేటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.  కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు తాలాడ సన్నిబాబు, నడిపేన రామ్మూర్తి, ఇఫ్టూ నాయకుడు కాళ్ల అప్పలసూరి పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-03-03T05:44:48+05:30 IST