చాణక్య నీతి: ప్రతిరోజునూ ప్రయోజనకరంగా మార్చుకునేందుకు అమూల్య సూత్రాలివే..

ABN , First Publish Date - 2022-02-15T12:26:00+05:30 IST

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మనిషి..

చాణక్య నీతి: ప్రతిరోజునూ ప్రయోజనకరంగా మార్చుకునేందుకు అమూల్య సూత్రాలివే..

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మనిషి తన జీవితంలోని ప్రతీక్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయాన్నే నిద్రలేచింది మొదలు రోజంతా సద్వనియోగం అయ్యేందుకు ఏమి చేయాలో ఆచార్య చాణక్య వివరంగా తెలిపారు. ఉదయాన్నే లేవడమనే అలవాటు  కారణంగా రోజంతా మనలో శక్తి నిలుస్తుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరించే వ్యక్తులు సంతోషంగా ఉంటూ, విజయాలు సాధిస్తారు. ఆచార్య చాణక్య తెలిపిన ఇలాంటి అమూల్య సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే మేల్కొనడం

చాణక్యుడి జీవన విధానం ప్రకారం ఉదయాన్నే నిద్ర లేవాలి. జీవితంలో విజయం సాధించాలనుకునేవారు తప్పని సరిగా దీనిని అలవాటు చేసుకోవాలి. ఆలస్యమైనా నిద్ర నుంచి మేల్కొనేవారు అనేక ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వ్యక్తి ఆరోగ్యంగా లేకుంటే అది అతని పనులపై ప్రభావం చూపుతుంది. ఇది ఆ వ్యక్తి పని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల పనిలో ఉత్సాహం ఏర్పడుతుంది

యోగాభ్యాసంతో..

ఉదయాన్నే నిద్రలేచి యోగాభ్యాసంతో పాటు వ్యాయామం చేయాలి. ఇది చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. రోజంతా పని చేసేందుకు శక్తి అందుతుంది. ఉదయం లేవగానే శరీరక వ్యాయామం చేయాలి. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 


సానుకూల శక్తి కోసం..

ప్రతిరోజూ ఉదయం  వేళ  దైవపూజ చేయాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. లక్ష్యాన్ని సాధించడంలో సానుకూల శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోండి 

అల్పాహారం తప్పనిసరి

ఎప్పుడూ ఖాళీ కడుపుతో ఇంటి నుండి బయటకు రావద్దు. ఉదయం నిద్రలేచిన తర్వాత తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారంలో నూనె వంటకాలు లేకుండా చూసుకోండి. పోషకాహారం తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయం అల్పాహారం తీసుకోవడం ద్వారా రోజులో చేయబోయే పనులకు శక్తి లభిస్తుంది.  


Updated Date - 2022-02-15T12:26:00+05:30 IST