విత్తనాలను సద్వినియోగం చేసుకోండి చేసుకోండి

ABN , First Publish Date - 2021-06-22T05:29:24+05:30 IST

సబ్సిడీ విత్తనాలను రైతులను సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబుచౌదరి కోరారు. సోమవారం చినవంకలో సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేశారు.

విత్తనాలను సద్వినియోగం చేసుకోండి  చేసుకోండి
రాజాం: విత్తనాలు పంపిణీ చేస్తున్న ఏడీఏ వెంకటరావు

వజ్రపుకొత్తూరు: సబ్సిడీ విత్తనాలను రైతులను సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబుచౌదరి  కోరారు. సోమవారం చినవంకలో సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా విత్తనాలు, ఎరువుల కోసం మండల కేంద్రాలకు వెళ్లకుండా గ్రా మాల్లోనిఆర్బీసీలను ఏర్పాటు చేశారని చెప్పారు. కార్యక్రమంలో  ఉప సర్పంచ్‌ రెయ్యి శ్రీనివాసరావు, సానా కృష్ణారావు పాల్గొన్నారు.


విత్తనాల పంపిణీ

రాజాం/నందిగాం: రైతులకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చిన వరి విత్తనాలను సోమవారం పంపిణీ చేశారు. రాజాం మండలం బొద్దాంలో ఏడీఏ వెంకటరావు విత్తనాలు అందజేసి మాట్లాడుతూ.. అందరు రైతులకు విత్తనాలందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ఏవో రేణుకాసాయి, ఏఈవో విజయలక్ష్మి పాల్గొన్నారు. అలాగే నందిగాం మండలం కాపుతెంబూరులో సర్పంచ్‌ పోలాకి మోహనరావు విత్తనాలు పంపిణీ చేశారు. రైతులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-06-22T05:29:24+05:30 IST