బహిరంగ సభను విజయవంతం చేయండి : బీజేపీ

ABN , First Publish Date - 2022-06-29T05:51:14+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సంద ర్భంగా జూలై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను విజయవంతం చే యాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి కోరారు.

బహిరంగ సభను విజయవంతం చేయండి : బీజేపీ
విలేకర్లతో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి

బాదేపల్లి, జూన్‌ 28 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సంద ర్భంగా జూలై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను విజయవంతం చే యాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి కోరారు. మంగళవారం పట్ట ణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో మాట్లా డారు. నియోజకవర్గ నుంచి 10వేలు, జడ్చర్ల నుంచి 8వేల మందిని జిల్లా నుంచి 28 వేల మందిని సభకు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా ముఖ్యనేతలం తా ప్రజానీకానికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలి పారు. సభకు వెళ్లేందుకు జిల్లా నుంచి 3 రైల్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వహ నాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రచారానికి జడ్చర్లకు గుజరాత్‌ నుంచి మాజీ సీఎం విజయ్‌ రూపాని, డిప్యూటీ సీఎం నితిన్‌ భాయి పటేల్‌ వస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ అఽధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి వెంకట్‌, నాయకులు రాపోతుల శ్రీనివాస్‌ గౌడ్‌, అనంతకిషన్‌, మధు, తిరుపతి, నాగరాజు గుప్త, ప్రతాప్‌రెడి ్డ, అశోక్‌, నర్సింహులు, నాయకులు పాల్గొన్నారు. 

ఫ దేవరకద్ర : హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభ గురించి దేవరకద్రలోనూ కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నంబీరాజు, మండల అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ రెడ్డి మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని జన సమీకరణ కోసం శక్తి ఇన్‌చార్జీలు బూత్‌ అధ్యక్షులు, పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, నాయకులు నరేష్‌ కుమార్‌, సాయిరాజు, రవి పాల్గొన్నారు.

ఫ అడ్డాకుల : వచ్చే నెల 3న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పాల్గొనే సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు కోరారు. మంగళవారం అడ్డాకులలో ఆ పార్టీ  మండ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి కేంద్రం ఇన్‌చార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కొత్తకోట మండల ఫ్లోర్‌ లీడర్‌ భరత్‌భూషణ్‌, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్‌సాగర్‌, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కావలి రాజు, బీజేపీ సీనియర్‌ నాయకుడు చెన్నగౌడ్‌, మండల ఉపాధ్యక్షుడు బుచ్చన్నగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:51:14+05:30 IST