నేటి మహాధర్నాను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-07-07T04:55:38+05:30 IST

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని టీఎ్‌సయూటీఎఫ్‌ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వెంకటకిరణ్‌ పిలుపునిచ్చారు.

నేటి మహాధర్నాను విజయవంతం చేయండి
చిన్నకోడూరులో మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వెంకటకిరణ్‌

జగదేవ్‌పూర్‌, జూలై 6: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని టీఎ్‌సయూటీఎఫ్‌ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వెంకటకిరణ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, హెడ్మాస్టర్‌ పర్యవేక్షణ అధికారులైన ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవోల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ నియామకాలు చేపట్టకపోవడం వల్ల విద్యావ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఉపాధ్యాయుల డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌, ప్రధాన కార్యదర్శి శివుడు, చేర్యాల కృష్ణ, మహ్మద్‌ పాషా పాల్గొన్నారు. 

చిన్నకోడూరు: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి నేడు (జూలై 7)న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కనకరాజు పిలుపునిచ్చారు. బుధవారం చిన్నకోడూరులో మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, యూఏస్‌ పీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాయపోల్‌: యూఎ్‌సపీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలిరావాలని టీపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు. గురువారం వడ్డేపల్లిలో మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. 

హుస్నాబాద్‌రూరల్‌: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అంబేడ్కర్‌ చౌరస్తాలో ఉపాధ్యాయుల నిరసన చేపట్టారు. 7న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-07-07T04:55:38+05:30 IST