శిక్షణ తరగతులు జయప్రదం చేయండి : ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2021-04-17T05:34:16+05:30 IST

చీపురు పల్లిలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించే జిల్లా స్థాయి విద్యావైద్యానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.రాము కోరారు.

శిక్షణ తరగతులు జయప్రదం చేయండి : ఎస్‌ఎఫ్‌ఐ
విజయనగరంలో కరపత్రాలను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు

 దాసన్నపేట: చీపురు పల్లిలో  ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించే జిల్లా స్థాయి విద్యావైద్యానిక శిక్షణ తరగతులను  జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.రాము కోరారు. గురువారం ఎల్‌బీజీ భవనంలోకరపత్రాన్ని విడుదల చేశారు.  నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో భాగంగానే జీవో నెం 77 తీసుకొచ్చిందని తెలిపారు.  పీజీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులను విద్యకు దూరం చేయడమే కాకుండా ఎయిడెడ్‌ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.  జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభమై, రెండేళ్లు పూర్తయినప్పటికీ,   భవ నాన్ని  నిర్మించలేదని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు రామకృష్ణ, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఫ చీపురుపల్లి: చీపురుపల్లిలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న   విద్యావైద్యానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రెస్‌క్లబ్‌ వద్ద పోస్టర్‌ను విడుదల చేశారు.  విద్యార్థులు, మేధావులు పాల్గొనాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు సీహెచ్‌ వెంకటేష్‌,  సహాయ కార్యదర్శి సతీష్‌దేవ్‌ సింగ్‌, నవీన్‌, బి. యమున, జె.కరుణ, కె. అచ్చియ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

 బాధ్యులను కఠినంగా శిక్షించాలి 

 దాసన్నపేట: కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తను అతి కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. ఎంఆర్‌ అటానమస్‌ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యా రంగం , మతసామరస్యం కాపాడడానికి ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడడం దారుణ మన్నారు.  ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు రాము, హర్ష, బుజ్జెమ్మ, రవి, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-17T05:34:16+05:30 IST