అబ్బురం... భయం

ABN , First Publish Date - 2021-07-28T05:58:02+05:30 IST

మేకప్‌ అంటే అందానికి మెరుగులు అద్దడమే కాదు... అప్పుడప్పుడూ ఇలాంటి అద్భుత చిత్రాలూ ఆవిష్కరిస్తుంది. ఉన్నది లేనట్టుగా చూపించగలదు.

అబ్బురం... భయం

మేకప్‌ అంటే అందానికి మెరుగులు అద్దడమే కాదు... అప్పుడప్పుడూ ఇలాంటి అద్భుత చిత్రాలూ ఆవిష్కరిస్తుంది. ఉన్నది లేనట్టుగా చూపించగలదు. లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించగలదు. ఇదిగో ఇలా... మీ కళ్లను మీరే నమ్మలేనంతగా. కెనడాలోని వాంకోవర్‌కు చెందిన మేకప్‌ ఆర్టిస్ట్‌ మిమి చోయ్‌ తనపై తాను చేసుకున్న ప్రయోగం ఇది. ‘ఆప్టికల్‌ ఇల్యూషన్‌’ పేరుతో ఆమె ఈ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అది మొదలు మిమి ముఖం పెద్ద పజిల్‌గా మిగిలిపోయింది. కళ్లు, ముక్కు, చెవులు, నోరు... ఆమె ముఖంలో ఎక్కడ చూసినా... ఎటు తిప్పినా లెక్కకు మించి అవే కనిపిస్తాయి. అసలు అవయవాలు ఏవి? మేకప్‌తో తెచ్చిపెట్టినవేవీ? దీన్ని కనిపెట్టే పనిలో ఆమె ఫాలోవర్లు లక్షల సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోటీపడుతున్నారు. ఫొటోతో పాటు వీడియో కూడా పోస్ట్‌ చేసిన మిమి ప్రయత్నాన్ని కొందరు అభినందిస్తున్నా... అధిక శాతంమంది మాత్రం ‘భయపెడుతోంద’ని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు... ‘అద్భుతంగానే కాదు... భయానకంగానూ ఉంది’ అని మిమిని పొగడ్తలతో ముంచెత్తుఉన్నారు.


‘ఎన్‌బీఏ’ స్టార్‌ రెక్స్‌ చాంపన్‌ ఈ వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ దెబ్బకు ఒక్కసారిగా వ్యూయర్‌షిప్‌ పెరిగిపోయింది. మిమి పేరు ప్రపంచమంతా పాకింది. ఇలాంటి ప్రయోగాలు మిమికి  కొత్తేమీ కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ వదులుతూనే ఉంటుంది. ఆమె ముఖమే ఆమెకు కాన్వాస్‌. దానిపై చేయని ప్రయోగం లేదు. మిమి లక్ష్యం ఒక్కటే... మేకప్‌ ఏదైనా మునుపెన్నడూ చూడనిదై ఉండాలి. చూడగానే మైండ్‌ బ్లాక్‌ అయిపోయవాలి. కాస్తంత వినోదం అందించాలి. ‘‘ఈ మేకప్‌ సమయంలో మూడుసార్లు నిద్రపోయాను. నాకు మైకం కమ్మేసింది. వికారంగానూ అనిపించింది’’ అంటూ నవ్వులు చిందించింది మిమి.


Updated Date - 2021-07-28T05:58:02+05:30 IST