ఆహార వ్యర్థాలతో పశుగ్రాసం.. 70 మందికి ఉపాధి.. కోటి దాటిన వార్షిక టర్నోవర్.. ఎక్కడంటే..

Published: Sun, 27 Mar 2022 10:22:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆహార వ్యర్థాలతో పశుగ్రాసం.. 70 మందికి ఉపాధి.. కోటి దాటిన వార్షిక టర్నోవర్.. ఎక్కడంటే..

దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకుపోతుంటాయి. ఇది అందరికీ పెద్ద సవాలుగా నిలిచింది. అయితే ఢిల్లీకి చెందిన సాకేత్ ఆహార వ్యర్థాల నుండి పశువుల దాణాను తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 5 వేల టన్నుల ఆహార వ్యర్థాలను పశువుల దాణాగా మారుస్తున్నారు. అతని వార్షిక టర్నోవర్ కోటి రూపాయలు దాటింది. దీంతో పాటు సాకేత్ 70 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇంజనీరింగ్ చదివిన సాకేత్‌కు  మొదటి నుంచి పర్యావరణ రంగంపై ఎంతో ఆసక్తి. కాలేజీ టైం నుంచి వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టేవాడు. ఇందుకుగాను అంతర్జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఓ స్టార్టప్‌లో చేరాడు. చాలా కాలం పాటు వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు. ఈ క్రమంలో థాయ్‌లాండ్‌కు వెళ్లే అవకాశం కూడా లభించింది. తర్వాత తన సొంత స్టార్టప్ ప్లాన్ చేశాడు. 

2018వ సంవత్సరంలో వెస్ట్‌లింక్ పేరుతో సొంత కంపెనీని ప్రారంభించాడు. మొదటి 6 నెలలు వేర్వేరు వ్యర్థాలతో నూతన ఉత్పత్తులు చేశానని సాకేత్ తెలిపారు. అయితే ఈ రంగంలో చాలా మంది పనిచేస్తున్నారని గ్రహించాను. ఆహార వ్యర్థాల రంగంలో చాలా తక్కువ మంది ఉన్నారని తెలుసుకున్నాను. ఆహార వ్యర్థాల నుండి పశువుల మేత తయారు చేసేవారు అధికంగా లేరని నా సర్వేలో తేలింది. ఇది మార్కెటింగ్‌కు చాలా స్కోప్‌ని కలిగి ఉంటుందని గ్రహించానన్నారు. 2019వ సంవత్సరంలో సాకేత్.. సోనేపట్‌లో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోని పెద్ద హోటళ్ళు, రెస్టారెంట్ల నుండి ఆహార వ్యర్థాలను సేకరించడం ప్రారంభించారు. దానిని పశువుల మేతగా మార్చారు. సాకేత్ చేస్తున్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో అనేక పెద్ద ఆహార సంస్థలు   చేయూతనందించాయి. దీంతో సాకేత్‌కు భారీ పరిమాణంలో ఆహార వ్యర్థాలను లభ్యం అయ్యాయి. ఆ తర్వాత నిధుల సమీకరణ కోసం సాకేత్ పలువురు ఇన్వెస్టర్లను సంప్రదించాడు. పెట్టుబడిదారులలో ఒకరైన కృష్ణన్ భాగస్వామిగా మారారు. సాకేత్ మీడియాతో మాట్లాడుతూ మా ఉత్పత్తులను నేరుగా రైతులకు విక్రయించడం లేదు. వివిధ పశువుల దాణా తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. వ్యర్థాల నుంచి పోషకాహార ముడిసరుకును తయారు చేసి వారికి అందజేస్తున్నాం. దీని నుండి ఈ కంపెనీలు ప్రాసెసింగ్ ద్వారా ఫీడ్‌ను సిద్ధం చేస్తాయి. ఆ తర్వాత రైతులకు అందజేస్తారు. 

ఆహార వ్యర్థాలతో పశుగ్రాసం.. 70 మందికి ఉపాధి.. కోటి దాటిన వార్షిక టర్నోవర్.. ఎక్కడంటే..

ఒక కిలో దాణా ఖరీదు దాదాపు రూ.25. ప్రస్తుతం దేశంలోని ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగుళూరు నగరాల్లో ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 70 మంది పనిచేస్తున్నారు. ప్రతిరోజూ 13 టన్నులకు పైగా వ్యర్థాలను దాణాగా మారుస్తున్నారు. దీనితో పాటు మేము ఫ్రాంచైజీ మోడల్‌పై కూడా పని చేయడం ప్రారంభించాం. అంటే ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, మేము వారికి సెటప్ అందిస్తాం. ముందుగా వివిధ ప్రాంతాల నుంచి ఆహార వ్యర్థాలను సేకరించి మా యూనిట్ కు తీసుకొస్తాం. దీని తరువాత ఆ ఆహార వ్యర్థాలను వివిధ వర్గాలుగా విభజిస్తాం. పొడి వ్యర్థాలు, తడి వ్యర్థాలు, వ్యర్థాలు, ఉత్పత్తి, నాణ్యత ప్రకారం ప్యాక్, అన్‌ప్యాక్ చేస్తాం. దీని తర్వాత మా నిపుణులు ఆ వ్యర్థ ఉత్పత్తులను విశ్లేషిస్తారు. వివిధ కెటిల్స్ కోసం పోషక విలువ ప్రకారం ఒక ఫార్ములా తయారు చేస్తాం. ఆ ఫార్ములా ప్రకారం దాణాను తయారు చేసే కంపెనీలకు అందజేస్తామని తెలిపారు. కాగా భారతదేశంలో ప్రతిరోజూ 1.5 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో దాదాపు 50% ఆహారం వృథా అవుతుంది. ఇందులో కొంత భాగాన్ని మాత్రమే అప్‌సైకిల్ చేయవచ్చు. 

ఆహార వ్యర్థాలతో పశుగ్రాసం.. 70 మందికి ఉపాధి.. కోటి దాటిన వార్షిక టర్నోవర్.. ఎక్కడంటే..

పశుగ్రాస మార్కెట్ విషయానికి వస్తే దేశంలో ఏటా రూ.500 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. వచ్చే ఏడాది నాటికి రూ.700 కోట్ల మార్కును దాటనుంది. అంటే ఈ రంగంలో బిజినెస్ పరంగా చాలా స్కోప్ ఉందని తెలుస్తోంది. మీరు ఈ రకమైన స్టార్టప్‌ను చిన్న స్థాయిలో ప్రారంభించాలనుకుంటే, మీకు తయారీ యూనిట్, ముడిసరుకు రూపంలో ఆహార వ్యర్థాలు, కొంతమంది ట్రెండ్ ఆర్టిజన్లు, ప్యాకేజింగ్ మెటీరియల్ అవసరం. దీనికి దాదాపు రూ.5-6 లక్షలు ఖర్చు అవుతుంది.  ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల వరకూ రుణం కూడా లభిస్తుంది. మీరు ఈ రుణాన్ని ఏదైనా సహకార బ్యాంకు లేదా ఎస్బీఐ నుండి తీసుకోవచ్చు. నాబార్డ్ నుండి ఈ రుణంపై 25% సబ్సిడీ కూడా లభిస్తుంది. మీరు రిజర్వ్‌డ్ వర్గానికి చెందినవారైతే, 33% వరకు సబ్సిడీ లభిస్తుంది. ఇంతేకాకుండా చాలా మంది పెట్టుబడిదారులు ఫండ్ సపోర్టును కూడా అందిస్తారు. కాగాదేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వ్యర్థ పదార్థాల నిర్వహణలో శిక్షణ ఇస్తున్నాయి. డిప్లొమా, డిగ్రీ కోర్సులు ఉన్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇండియా, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వంటి సంస్థల నుండి శిక్షణ తీసుకోవచ్చు. పలు సంస్థలు ఆన్‌లైన్‌లో కూడా శిక్షణను అందిస్తున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.