విరిగిన పాలతో...

ABN , First Publish Date - 2020-07-06T05:30:00+05:30 IST

పాలు ఒక్కోసారి విరిగిపోతుంటాయి. వాటితో పనీర్‌ చేసుకుంటాం. మిగిలిన నీళ్లను పారబోస్తుంటాం. అలాకాకుండా ఆ నీళ్లను ఇలా కూడా ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం...

విరిగిన పాలతో...

పాలు ఒక్కోసారి విరిగిపోతుంటాయి. వాటితో పనీర్‌ చేసుకుంటాం. మిగిలిన  నీళ్లను పారబోస్తుంటాం. అలాకాకుండా ఆ నీళ్లను ఇలా కూడా ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం...

  1. సాధారణంగా చపాతీ పిండిలో నీళ్లు కలుపుతాం. ఈసారి విరిగిన పాల నుంచి తీసిన నీటిని కలిపితే చపాతీలు చక్కగా వస్తాయి. రుచిగానూ ఉంటాయి.
  2. కూరగాయలు వండేటప్పుడు సూప్‌ కోసం విరిగిన పాలలోని నీళ్లను వాడవచ్చు. ఈ నీళ్లతో కూర చేస్తే కూర రుచిగా ఉంటుంది. అలానే పప్పుదినుసులు వండినప్పుడు ఈ నీళ్లు పోస్తే కూర టేస్టీగా వస్తుంది.
  3. విరిగిన పాలలోని  నీటిలో కొద్దిగా వెచ్చని నీళ్లు కలపాలి. ఆ నీటిని అన్నం వండేందుకు ఉపయోగిస్తే అన్నంలో పోషకాలు, ప్రొటీన్లు చేరతాయి. అన్నం రుచీ పెరుగుతుంది. అంతేకాదు విరిగిన పాల నీటిని వాడితే నూడిల్స్‌ టేస్టీగా వస్తాయి.

Updated Date - 2020-07-06T05:30:00+05:30 IST