మలక్‌పేట కానిస్టేబుల్‌ ఓవరాక్షన్‌

ABN , First Publish Date - 2020-10-27T10:13:52+05:30 IST

మలక్‌పేట కానిస్టేబుల్‌ రూప్‌సింగ్‌ ముసారాంబాగ్‌ డివిజన్‌లోని సంజీవయ్య నగర్‌ బస్తీలో శనివారం రాత్రి బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకొచ్చి ఓవరాక్షన్‌ చేశాడు

మలక్‌పేట కానిస్టేబుల్‌ ఓవరాక్షన్‌

బతుకమ్మను ఆడుతుండగా అసభ్య పదజాలం

బస్తీవాసులను అరెస్టు చేసేందుకు హంగామా


చాదర్‌ఘాట్‌, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): మలక్‌పేట కానిస్టేబుల్‌ రూప్‌సింగ్‌ ముసారాంబాగ్‌ డివిజన్‌లోని సంజీవయ్య నగర్‌ బస్తీలో శనివారం రాత్రి బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకొచ్చి ఓవరాక్షన్‌ చేశాడు. రోడ్డుపై బతుకమ్మ ఆడొద్దంటూ దబాయించాడు. అరగంట గడిచినా బతుకమ్మను ఎందుకు ముగించలేదంటూ బూతులు తిట్టాడు. మహిళలకు భోజనాలు పెట్టి 10 నిమిషాల్లో ముగిస్తామని నచ్చజెప్పేందుకు సాయిబాబా అనే బస్తీవాసి ప్రయత్నించినా పట్టించుకోకుండా హంగామా చేశాడు. అరెస్టు చేస్తానంటూ బలవంతంగా లాగడంతో సాయిబాబా కింద పడిపోయాడు.


అయినా కానిస్టేబుల్‌ రూప్‌సింగ్‌ వదలకుండా ముగ్గురు బస్తీవాసులను పెట్రోలింగ్‌ కారులో ఎక్కించుకుని మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. స్థానికులు తీసిన వీడియోలో కానిస్టేబుల్‌ ఓవరాక్షన్‌ బయటపడింది. ఈ ఘటనపై బస్తీవాసులతో కలిసి బీజేపీ నేతలు మలక్‌పేట సీఐ కేవీ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించానని, ఆదేశాలు రాగానే కానిస్టేబుల్‌ రూప్‌సింగ్‌పై చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. 

Updated Date - 2020-10-27T10:13:52+05:30 IST