షూటింగులో గాయపడిన ‘మాస్టర్’ మూవీ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Nov 29 2021 @ 21:35PM

కోలీవుడ్‌ హీరోయిన్‌, కేరళ భామ మాళవికా మోహనన్‌ ఓ సినిమా షూటింగులో గాయపడింది. ఆమె చేతికి, కాలికి దెబ్బలు తగిలాయి. ఈ దెబ్బలతో కూడిన ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పేట’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మాళవికా మోహనన్‌ ఆ తర్వాత స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నటించింది.  ఇపుడు మరో స్టార్‌ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్‌ నటిస్తున్న ‘మారన్‌’ మూవీలో కథానాయికగా నటిస్తోంది. 


అదేసమయంలో రవి ఉడయార్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ చతుర్వేది హీరోగా నటిస్తున్న ‘యుత్ర’లో మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆమె చేతికి గాయమైంది. ఈ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయగా,  దాదాపు 2 లక్షల మందికి పైగా లైక్‌ చేయడం గమనార్హం. ఇదిలావుంటే మాళవిక ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ తీసిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.