Prabhas కు నో చెప్పలేకపోయిన మలయాళ స్టార్..

Published: Sat, 25 Jun 2022 17:28:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Prabhas కు నో చెప్పలేకపోయిన మలయాళ స్టార్..

ప్రభాస్‌ (Prabhas) అడిగితే కాదనలేకపోయానని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'కడువ' (Kaduva). ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో 'కడువ' సినిమా ప్రమోషన్ కోసం అన్ని ముఖ్య నగరాల్లో పృథ్వీరాజ్ పర్యటించబోతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మన గ్లోబల్ స్టార్ ప్రభాస్ గురించి పృథ్వీరాజ్ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్' (Salaar). ఈ సినిమాలో కీలక పాత్రకోసం నన్ను అడిగారు. అయితే, కరోనా కారణంగా అన్నీ తారుమారయి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను. దాంతో నో చెప్పాను. ఇదే సమయంలో 'సలార్' సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అయింది. అయితే, మళ్ళీ ప్రభాస్ అడిగారు. అప్పుడు మాత్రం కాదనలేకపోయాను అని పృథ్వీరాజ్ తెలిపారు. ఇక 'సలార్' కథ పూర్తిగా విన్నాను. ఈ కథ, స్క్రీన్ ప్లే మొత్తం నాకు తెలుసు అని చెప్పారు.

అంతేకాదు, ప్రశాంత్ నీల్ 'సలార్' చిత్రాన్ని అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూస్తానా.. అనే ఆతృతతో ఉన్నాను అని పృథ్వీరాజ్ వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ (Shruthi Haasan) నటిస్తోంది. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొత్తానికి పృథ్వీరాజ్ సుకుమారన్ 'సలార్‌'లో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న విషయాన్ని రివీల్ చేశారు. మరి ఎలాంటి రోల్‌లో కనిపించబోతున్నారో తెలియాలంటే సలార్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International