దుబాయిలో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలుస్తున్న మళయాలీ సంఘం

ABN , First Publish Date - 2021-03-09T05:48:20+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు గతేడాది భారతదేశానికి వచ్చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వీరిలో చాలా మంది తిరిగి తమ ఉద్యోగాల్లో చేరేందుకు జనవరిలో దుబాయి చేరుకున్నారు.

దుబాయిలో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలుస్తున్న మళయాలీ సంఘం

దుబాయి: కరోనా మహమ్మారి కారణంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు గతేడాది భారతదేశానికి వచ్చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వీరిలో చాలా మంది తిరిగి తమ ఉద్యోగాల్లో చేరేందుకు జనవరిలో దుబాయి చేరుకున్నారు. దుబాయి నుంచి వీరంతా సౌదీ, కువైట్ తదితర దేశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే క్వారంటైన్ నిబంధనల కారణంగా వీరంతా దుబాయిలోనే 14 రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో సౌదీ, కువైట్ దేశాలు విదేశీయులపై ప్రయాణ ఆంక్షలు విధించింది. 


ఈ నేపథ్యంలో దుబాయిలో క్వారంటైన్ పూర్తి చేసుకున్న భారతీయులు అటు సౌదీ, కువైట్ దేశాలకు వెళ్లలేక, ఇటు దుబాయిలో ఉండలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఓవర్సీస్ మళయాలీ అసోసియేషన్(ఓఆర్ఎమ్ఏ) అండగా నిలుస్తోంది. దుబాయిలో చిక్కుకున్న భారతీయులకు ఆహారం, మెడిసిన్, వసతి కల్పిస్తోంది. ఓఆర్ఎమ్ఏ వసతి కల్పించిన భారతీయుల పరిస్థితిని ఇండియన్ కాన్సులేట్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. వారికి అవసరమైన అవసరాలను తీర్చుతోంది. తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే వారికి ఉచిత విమాన టిక్కెట్లను కూడా ఇవ్వనున్నట్టు ఇప్పటికే కాన్సులేట్ జనరల్ ప్రకటించింది.  

Updated Date - 2021-03-09T05:48:20+05:30 IST