Advertisement

బాలయ్యకు జోడీ కుదిరిందా?

Oct 17 2020 @ 09:49AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోవిడ్‌ ఎఫెక్ట్‌తో షూటింగ్‌ను ఆపేసింది. ఇప్పుడు క్రమంగా అన్నీ సినిమాలు కరోనా వైరస్‌ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్‌ ప్రారంభిస్తున్న తరుణంలో బాలకృష్ణ, బోయపాటి  తమ ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నారట. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ హీరోయిన్‌గా ఎంపికైందట. నెక్ట్స్‌ షెడ్యూల్‌లో ఆమె జాయిన్‌ అవుతుందని అంటున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రలు చేస్తుండగా ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. సింహా, లెజెండ్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మిర్యాల రవీందర్‌ రెడ్డి చిత్ర నిర్మాత. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.