రాత్రి 10 గంటలకు సరదాగా సైక్లింగ్‌కు వెళ్లిన చిన్నారులు.. ఇంతలో స్వమ్మింగ్‌పూల్‌లో షాకింగ్ సీన్.. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో..

ABN , First Publish Date - 2022-08-29T19:45:40+05:30 IST

స్థానికంగా ఉన్న చిన్నారులు అందరూ కలిసి రాత్రి 10 గంటల వేళ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడున్న స్విమ్మింగ్‌పూల్ వైపు చూశారు. అందులో వారికి షాకింగ్ సీన్ కనిపించింది. దీంతో వెంటనే అక్కడ నుంచి పరుగులు తీసిన చిన్నారులు.. విష

రాత్రి 10 గంటలకు సరదాగా సైక్లింగ్‌కు వెళ్లిన చిన్నారులు.. ఇంతలో స్వమ్మింగ్‌పూల్‌లో షాకింగ్ సీన్.. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో..

ఎన్నారై డెస్క్: స్థానికంగా ఉన్న చిన్నారులు అందరూ కలిసి రాత్రి 10 గంటల వేళ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడున్న స్విమ్మింగ్‌పూల్ వైపు చూశారు. అందులో వారికి షాకింగ్ సీన్ కనిపించింది. దీంతో వెంటనే అక్కడ నుంచి పరుగులు తీసిన చిన్నారులు.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకూ స్విమ్మింగ్‌పూల్‌లో చిన్నారులు ఏం చూశారు? అనే విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..



బహ్రెయిన్‌(Bahrain)లోని తుబ్లీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ పిల్లలు సైక్లింగ్ చేస్తుండగా.. స్విమ్మింగ్‌పూల్‌లో ఓ వ్యక్తి అచేతన స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అక్కడ నుంచి పరుగులు తీసిన చిన్నారులు.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలో పిల్లల తల్లిదండ్రులు.. పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. మృతుడిని సచిన్ సామ్యూల్(39)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. ఈత కొడుతుండగా.. హార్ట్ ఎటాక్ రావడంతో సామ్యూల్ మృతి చెందినట్టు నివేదిక ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సామ్యూల్(Sachin Samuel) కేరళ(Kerala)లోని ఎర్నాకులానికి చెందిన వ్యక్తి. ఓ ప్రైవేటు ఇన్సురెన్సు సంస్థలో సీనియర్ ఆఫీస్‌గా పని చేస్తున్న ఆయన.. ఈ మధ్యే దుబాయ్ నుంచి బహ్రెయిన్‌కు ట్రాన్సఫర్ అయ్యారు.


Updated Date - 2022-08-29T19:45:40+05:30 IST