వీసా ఆన్ అరైవల్‌పై Malaysia కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-04-29T13:30:58+05:30 IST

భారత ప్రయాణికులకు మలేషియా తీపి కబురు చెప్పింది. వీసా ఆన్ అరైవల్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. కాగా.. ఇందుకు సం

వీసా ఆన్ అరైవల్‌పై Malaysia కీలక నిర్ణయం

ఎన్నారై డెస్క్: భారత ప్రయాణికులకు మలేషియా తీపి కబురు చెప్పింది. వీసా ఆన్ అరైవల్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కొవిడ్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. వీసాల జారీ నిలిపివేయడంతోపాటు విమాన సర్వీసులను కూడా రద్దు చేశాయి. మలేషియా కూడా ఇదే పద్ధతి కొనసాగించింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తున్నాయి. మలేషియా కూడా ఏప్రిల్ 1 నుంచి అన్ని కొవిడ్ ఆంక్షలను ఎత్తేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టిసారించిన ఆ దేశ ప్రభుత్వం.. టూరిస్ట్‌లను ఆకర్షించడం ద్వారా తిరిగి బలపడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారత టూరిస్ట్‌లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. వీసా ఆన్ అరైవల్ సర్వీసును తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే భారత ప్రయాణికులకు ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని మలేషియాస్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ డివిజన్ డైరెక్టర్ మనోహరన్ పెరియస్వామి ఓ ప్రకటనలో చెప్పారు. 




Updated Date - 2022-04-29T13:30:58+05:30 IST