మాట వినని భార్యలను కొట్టండి.. మలేసియా మంత్రి సలహా.. నెటిజన్ల ఫైర్!

ABN , First Publish Date - 2022-02-18T18:40:16+05:30 IST

మాట వినకుండా మొండిగా ఉండే భార్యలను కొట్టాలని సలహా ఇచ్చిన మలేసియా మహిళా డిప్యూటీ మంత్రి జైలా మహ్మద్‌ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి.

మాట వినని భార్యలను కొట్టండి..  మలేసియా మంత్రి సలహా.. నెటిజన్ల ఫైర్!

మాట వినకుండా మొండిగా ఉండే భార్యలను కొట్టాలని సలహా ఇచ్చిన మలేసియా మహిళా డిప్యూటీ మంత్రి జైలా మహ్మద్‌ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. `మదర్స్‌ టిప్స్‌` పేరుతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక వీడియో పోస్ట్‌ చేశారు. అందులో భార్యలతో ఎలా వ్యవహరించాలనే విషయంలో భర్తలకు సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు విమర్శలకు గురవుతున్నాయి. 


`భార్యను క్రమశిక్షణలో పెట్టేందుకు భర్త ఆమెను సున్నితంగా దండించవచ్చు. మాట వినకుండా మొండిగా వ్యవహరిస్తున్న భార్యతో ముందు మాట్లాడాలి. ఏ విషయంలో ప్రవర్తన మార్చుకోవాలో ఆమెకు చెప్పాలి. ఆమె మాటలతో మారకపోతే సున్నితంగా కొట్టండి. అప్పటికీ ప్రవర్తన మార్చుకోకపోతే ఆమెకు దూరంగా ఉండండ`ని సూచించారు. అంతేకాదు మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అతని అనుమతి తీసుకోవాలని కూడా చెప్పారు. 


జైలా మహ్మద్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. అత్యున్నత పదవిలో ఉన్నవాళ్ల ఆలోచనలు కూడా అత్యున్నతంగా ఉండాలని, మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఒక మహిళ అయ్యుండి అలా మాట్లాడడం సిగ్గుచేటని మరికొందరు విమర్శిస్తున్నారు. మంత్రి హోదాలో సాటి మహిళలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి  ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విషాదకరం అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-18T18:40:16+05:30 IST