BJP MP Pragya Thakur: మాలేగాం పేలుళ్ల కేసులో బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ పాత్ర...ఫోరెన్సిక్ నిపుణుల వెల్లడి

ABN , First Publish Date - 2022-08-03T17:32:39+05:30 IST

2008వ సంవత్సరంలో మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో జరిగిన బాంబు పేలుళ్ల(Malegaon blast case) కేసులో ఫోరెన్సిక్ నిపుణులు(forensic expert) సంచలన విషయాలు...

BJP MP Pragya Thakur: మాలేగాం పేలుళ్ల కేసులో బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ పాత్ర...ఫోరెన్సిక్ నిపుణుల వెల్లడి

ముంబయి(మహారాష్ట్ర): 2008వ సంవత్సరంలో మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో జరిగిన బాంబు పేలుళ్ల(Malegaon blast case) కేసులో ఫోరెన్సిక్ నిపుణులు(forensic expert) సంచలన విషయాలు బయటపెట్టారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్(BJP MP Pragya Thakur) లింక్ ఉందని ఫోరెన్సిక్ నిపుణుల బృందం తేల్చి చెప్పింది.మాలేగావ్ మసీదులో జరిగిన పేలుడు స్థలంలో పేలుడు పదార్థాలు ఉంచిన ఒక ఎల్ఎంఎల్ వెస్పా స్కూటరు(bike link) పోలీసులకు లభించింది. ఈ ఎల్ఎంఎల్ వెస్పా స్కూటర్ భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ పేరుపై రిజిస్టర్ చేసి ఉందని ఫోరెన్సిక్ నిపుణులు ముంబయిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు(special NIA court in Mumbai) నివేదించారు.


 ఈ పేలుళ్ల కేసులో 261 మంది సాక్షులను ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు విచారించింది.నాసిక్ జిల్లా మాలేగావ్ పట్టణంలోని మసీదులో(mosque in Malegaon town) 2008వ సంవత్సరం సెప్టెంబరు 29వతేదీన జరిగిన స్కూటర్ బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు. పేలుడు స్థలంలో లభించిన బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్(malegaon blast culprit) స్కూటరులో అమ్మోనియం నైట్రేట్ ను రికవరీ చేశామని ఫోరెన్సిక్ నిపుణులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తాము జరిపిన కెమికల్ పరీక్షల్లో(chemical analysis) అమ్మోనియం నైట్రేట్ ను పేలుడుకు ఉపయోగించారని సాక్షులు చెప్పారని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చిచెప్పారు. 


పేలుడు స్థలంలో లభించిన స్కూటరును కోర్టులో మరో సాక్షి గుర్తించారు.స్కూటరు బాంబుతో పేలుళ్లకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ప్రాథమికంగా మహారాష్ట్ర ఏటీఎస్ దర్యాప్తు చేసిన మాలేగావ్ పేలుళ్ల కేసును తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి బదిలీ చేసింది. 


బీజేపీ ఎంపీకి చెందిన ఎల్ఎంఎల్ వెస్పా స్కూటరు(malegaon blast case accused) పేలుడు స్థలంలో చెల్లాచెదురైందని, ఫ్యూయల్ ట్యాంకు, సీటు కవరు, స్కూటరు పార్టులు విడిపోయాయని ఫోరెన్సిక్ నిపుణులు కోర్టుకు చెప్పారు. పేలుడు స్థలంలో లభించిన స్కూటర్ భాగాలను సేకరించి పరీక్షించి పేలుడు పదార్థాలతో పేలుళ్లు జరిపారని ఫోరెన్సిక్ నిపుణుడు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినాష్ రసాల్ చెప్పారు.స్కూటర్ ఇంజిన్ నంబరును స్రాచ్ చేశారని ఓ సాక్షి వివరించారు.

Updated Date - 2022-08-03T17:32:39+05:30 IST