పసివాడికి ప్రాణాంతక వ్యాధి

ABN , First Publish Date - 2022-06-29T08:36:30+05:30 IST

పసివాడికి ప్రాణాంతక వ్యాధి

పసివాడికి ప్రాణాంతక వ్యాధి

వైద్యానికి రూ.15 లక్షలు అత్యవసరం

అంత స్తోమత లేక తల్లడిల్లుతున్న తల్లి

దాతలు ఆదుకోవాలని వేడుకోలు


కూడేరు, జూన్‌ 28: అనంతపురం జిల్లా కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి శ్రీచరణ్‌.. ఎముకల వ్యాఽఽధితో ఏడాదిగా బాధపడుతున్నాడు. కన్న కొడుకును కాపాడుకునేందుకు తగినంత ఆర్థిక స్తోమత లేక తల్లి మౌనిక తల్లడిల్లిపోతోంది. మౌనిక, మనోహర్‌ దంపతులకు ఏడేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు శ్రీచరణ్‌ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. ఆటో డ్రైవర్‌ అయిన మౌనిక భర్త మనోహర్‌ 10 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు కొడుకును ఎలా కాపాడుకోవాలో తెలియక.. ఆపన్న హస్తం కోసం ఎదురు చూ స్తోంది. శ్రీచరణ్‌ను బెంగళూరుకు తీసుకెళ్లి పరీక్ష చే యించగా ఎముకల వ్యాధితో బాధుపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆమె దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. సొంత ఇల్లు కూడా లేని ఆమెకు బతుకు భారం కావడంతో స్థానికులు అండ గా నిలిచి గ్రామ వలంటీర్‌గా అవకాశం ఇప్పించారు. నెల నెలా వచ్చే రూ.5 వేలతో బిడ్డలను పోషిస్తోంది.  బాధిత కుటుంబానికి అదే గ్రామానికి చెందిన అగ్రి చైర్మన్‌ మేరి నిర్మలమ్మ రూ.20 వేలు అందజేశారు. చిన్నారికి ఆపరేషన్‌ చేయాలంటే రూ.15 లక్షల అవసరమని, దాతలు సాయం చేసి, ప్రాణాలు నిలపాలని మౌనిక వేడుకుంటోంది. సాయం అందించేవా రు మౌనిక, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతా నం: 91122258149, కూడేరు, అనంతపురం జిల్లా, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌: ఏపీజీబీ 0001059, ఫోన్‌పే నంబర్‌: 9704493421 జమ చేయవచ్చు.

Updated Date - 2022-06-29T08:36:30+05:30 IST