హైదరాబాద్: మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. స్థానిక శారదా నగర్‌లోని మంజుపురా అపార్ట్‌మెంట్స్ దగ్గరలో నివాసం ఉంటున్న పురంసీతి వీరేంద్ర కుమార్(49) కనుపడుట లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలరని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎత్తు ఐదు అడుగుల ఏడు అంగుళాలని తెలిపారు. ఆయన ఎక్కడైనా కనపడితే తమకు సమాచారం అందించగలరని మల్కాజిగిరి పోలీసులు ట్వీట్ చేశారు.