మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల గోడు కేసీఆర్ స‌ర్కార్‌కు పట్టదా..: విజయశాంతి

Published: Tue, 22 Feb 2022 20:28:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల గోడు కేసీఆర్ స‌ర్కార్‌కు పట్టదా..: విజయశాంతి

హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితుల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్ల మాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన కుటుంబాలు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయని, ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన ఆఫీసర్లు.. ఆ తరువాత వారి సమస్యలను గాలికి వదిలేశారని విజయశాంతి విమర్శించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..


''కేసీఆర్ స‌ర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ మ‌ల్ల‌న్న సాగ‌ర్. రిజర్వాయర్​ ప్రారంభానికి రెడీ అయినా మల్లన్నసాగర్ నిర్వాసితుల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. రిజర్వాయర్‌ను ఈ నెల 23న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఆఫీసర్ల మాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన  కుటుంబాలు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయి. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన ఆఫీసర్లు... ఆ తరువాత వారి సమస్యలను గాలికి వదిలేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌తో 8 పంచాయతీల్లోని దాదాపు 6,533 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయడం కోసం ఒక్కో గ్రామాన్ని విడతలవారీగా పలు హామీలిస్తూ... ఆఫీసర్లు తరలించారు. దాదాపు 22 నెలల క్రితం లక్ష్మాపూర్ గ్రామ నిర్వాసితులను తరలించగా... 8 నెలల క్రితం చివరిగా బ్రాహ్మణ బంజేరుపల్లి నిర్వాసితులను తరలించారు. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించేటప్పుడు వారి ఆప్షన్ల మేరకు కొందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించగా మరికొందరికి ఓపెన్ ప్లాట్లను ఇవ్వడానికి హామీ ఇచ్చారు. దాదాపు ఏడాది కావస్తున్నా... 3500 కుటుంబాలకు అటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గానీ, ఇటు ఓపెన్ ప్లాట్లను గానీ ఇవ్వలేదు. నిర్వాసితులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తూ... ఆవేదనతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు ఆడ పిల్లలున్న రాజబాబు అనే నిర్వాసితుడు ఏడాది క్రితం ప్యాకేజీ అందక ఆవేదనకు లోనై గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆరు నెలల క్రితం బానోతు హన్మంతు అనే నిర్వాసితుడు చనిపోగా, ఒంటరి మహిళల ప్యాకేజీ అందక వేములఘాట్ గ్రామానికి చెందిన ఎన‌బై ఏళ్ల వృద్ధురాలు బాలవ్వ ఆత్మహత్య చేసుకుంది. భవిష్యత్తు ఆశలపై నీళ్లు జల్లిన ఈ పాలక రాబందుల కారణంగా ఊరికాని ఊరిలో తనువు చాలించిన అభాగ్యుల‌ ఉసురు ఊరికనే పోదు. ప్లాట్ల దందాల కోసం నిర్వాసితులకు వారి గ్రామాలతో శాశ్వతంగా బంధాల్ని తెంచేస్తున్న దౌర్భాగ్యులకు పుట్టగతులు ఉండవు. అమ్మలారా, అక్కలారా... మీరెవరూ ఆత్మ‌హత్య‌లు చేసుకోకండి. మీకు అండాగా బీజేపీ ఉంటుంది. మ‌నకు దక్కాల్సిన హక్కులను కొట్లాడి సాధించుకుందాం.... కేసీఆర్​ను గద్దె దించుదాం.. అని విజయశాంతి అన్నారు.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తెలంగాణ Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.