Advertisement

మల్లికా షెరావత్‌.. మళ్లీ వస్తోంది

Feb 26 2021 @ 21:22PM

కోలీవుడ్‌: ‘ఓరంపో’, ‘వాత్తియార్‌’, ‘6.2’ వంటి పలు చిత్రాలను నిర్మించిన వైద్యనాథన్‌ ఫిలిమ్స్‌ గార్డెన్‌ తాజాగా ‘పాంబాట్టం’ పేరుతో మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇందులో బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వీసీ.వడివుడయాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘నాన్‌ అవన్‌ ఇల్లై’ అనే చిత్రం ద్వారా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న జీవన్‌ హీరోగాను,  రితికా సేన్‌, యాషిక ఆనంద్‌లు కథానాయికలుగాను నటిస్తున్నారు. తమిళంలో సుదీర్ఘకాలం తర్వాత ఇళవరసి నాగమతి పాత్రలో మల్లికా షెరావత్‌ నటిస్తోంది. అలాగే, అశీష్‌ విద్యార్థి మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. 


1800, 1947, 1990 సంవత్సరాల్లో జరిగిన చారిత్రక కథను తీసుకుని, హారర్‌, థ్రిల్లర్‌లను జోడించి తెరకెక్కిస్తున్నట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్‌ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో మల్లికా షెరావత్‌ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అమ్రిష్‌ సంగీత బాణీలు సమకూర్చే ఈ చిత్రానికి డీవోపీగా ఇనియ్‌ జె హ్యారీస్‌ పనిచేస్తుండగా.. కథ, స్ర్కీన్‌ప్లే, మాటలను దర్శకుడు వీసీ వడివుడైయాన్‌ సమకూర్చారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.