తెలంగాణలో Congressలోకి వలసలు పెరిగాయి: Mallu Ravi

ABN , First Publish Date - 2022-07-03T14:44:45+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగాయని పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. కార్యకర్తలలో భరోసా.. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు.

తెలంగాణలో Congressలోకి వలసలు పెరిగాయి: Mallu Ravi

Hyderabad : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్‌(Congress)లోకి వలసలు పెరిగాయని పార్టీ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. కార్యకర్తలలో భరోసా.. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని పార్టీ సీనియర్ నేతల రాహుల్(Rahul) స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. పొత్తుల విషయం మాట్లాడవద్దని రాహుల్ ఆదేశాలు జారీ చేశారన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్ సూచించారన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jaggareddy) వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని మల్లు రవి పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాల్సిందన్నారు. పార్టీ అధ్యక్షులపై ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటం వల్ల మన శత్రువులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు. ఇది క్యాడర్ మనోస్త్యైర్యాన్ని దెబ్బదీసి పార్టీకి తీరని నష్టం చేస్తుందని మల్లు రవి పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే అధిష్టానం స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పార్టీకి రెండు కళ్ళలాగా పని చేస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మల్లు రవి పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-03T14:44:45+05:30 IST