ఇది సామాన్యునికి ఉపయోగపడని బడ్జెట్ : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-02-01T22:01:01+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు

ఇది సామాన్యునికి ఉపయోగపడని బడ్జెట్ : మమత బెనర్జీ

కోల్‌కతా : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ వల్ల సామాన్యులకు ఏమాత్రం ఉపయోగం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వల్ల అణగారిపోతున్నవారికి దీనివల్ల ఉపశమనం కలగదని చెప్పారు. 

మమత మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఈ బడ్జెట్‌లో సామాన్యులకు శూన్యం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వల్ల సామాన్యులు అణగారిపోతున్నారన్నారు. అలాంటివారికి ఈ బడ్జెట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ఇది పెగాసస్ స్పిన్ బడ్జెట్ అని దుయ్యబట్టారు. 


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాజ్యసభకు సమర్పించారు. ఈ బడ్జెట్ ప్రజలకు స్నేహపూర్వకమైనది, ప్రగతిశీలమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాలకు నూతన అవకాశాలను తీసుకొచ్చే బడ్జెట్ ఇది అని తెలిపారు. 


Updated Date - 2022-02-01T22:01:01+05:30 IST