దేశంలో ప్రస్తుత పరిస్థితి బాగోలేదు: Mamata Banerjee

ABN , First Publish Date - 2022-05-03T19:56:38+05:30 IST

ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ మరోసారి..

దేశంలో ప్రస్తుత పరిస్థితి బాగోలేదు: Mamata Banerjee

కోల్‌కతా: ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ మరోసారి Bjpపై విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఎంతమాత్రం బాగాలేదని, ఒంటరి రాజకీయాలే ఇందుకు కారణమని అన్నారు. కోల్‌కతాలోని రైన్-డ్రెంచ్డ్ రెడ్ రోడ్‌లో మంగళవారం జరిగిన Eid ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలెవరూ భయపడవద్దని, మంచి భవిష్యత్తు కోసం అంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు.


''దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదు. విభజించి పాలించే విధానాలు, ఒంటరి రాజకీయాలు ఏమాత్రం సరికాదు. భయపడొద్దు...కలిసికట్టుగా పోరాడుదాం''అని Mamata Banerjee అన్నారు. తాను కానీ, తన పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ప్రజలకు కష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టదని భరోసా ఇచ్చారు. రెడ్-రోడ్డులో జరిగిన ఈద్ ప్రార్థనల్లో సుమారు 14,000 మంది పాల్గొన్నారు.

Read more