2024లో ప్రధానిగా Mamata Banerjee .. ముఖ్యమంత్రిగా అభిషేక్ బెనర్జీ: టీఎంసీ ఎంపీ క్లారిటీ

ABN , First Publish Date - 2022-05-03T22:05:34+05:30 IST

అభిషేక్ బెనర్జీ 2036లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారంటూ టీఎంసీ అధికార ప్రతినిధి Kunal Ghosh చేసిన

2024లో ప్రధానిగా Mamata Banerjee .. ముఖ్యమంత్రిగా అభిషేక్ బెనర్జీ: టీఎంసీ ఎంపీ క్లారిటీ

కోల్‌కతా: అభిషేక్ బెనర్జీ 2036లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారంటూ టీఎంసీ అధికార ప్రతినిధి Kunal Ghosh చేసిన ట్వీట్‌పై ఆ పార్టీ ఎంపీ Aparupa Poddar మరింత క్లారిటీ ఇచ్చారు. Mamata Banerjee 2024లో ప్రధాని అవుతారని, అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని పొద్దార్ జోస్యం చెప్పారు. ఆరెస్సెస్ ఎంపిక చేసిన రాష్ట్రపతి 2024లో మమతా బెనర్జీతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని, అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని పొద్దార్ ట్వీట్ చేశారు. అయితే, గంటలోపే ఆ ట్వీట్‌ను ఆమె డిలీట్ చేయడం గమనార్హం.

 

బెంగాల్‌లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ట్వీట్ చేస్తూ 2036లో Abhishek Banerjee బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. టీఎంసీ సైనికుడిగా 2036లో మమత ప్రధాని అవుతారని తాను చెప్పగలనని అన్నారు. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రిగా చేసే ప్రమాణ స్వీకారానికి మమత హాజరవుతారని ఆ ట్వీట్‌లో ఘోష్ పేర్కొన్నారు.


Read more