Congress, BJPకి దూరంగా TRS

ABN , First Publish Date - 2022-06-15T16:38:11+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో రాజకీయ పార్టీలు బిజీగా మారాయి.

Congress, BJPకి దూరంగా TRS

ABN Desk: రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో రాజకీయ పార్టీలు బిజీగా మారాయి. బుధవారం ఢిల్లీలో పశ్చిమబెంగాల్ సీఎం మమత (Mamata) అధ్యక్షతన విపక్షాల సమావేశం జరగనుంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఈ సమావేశంలో పాల్గొనరాదని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి సమానదూరం పాటించాలని కేసీఆర్ భావిస్తున్నారు.


ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొంటున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశంపై చర్చించేందుకు మమత ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి అభ్యర్థి అంశంపై మమత గతంలో కేసీఆర్‌కు ఫోన్ చేసినప్పుడు కాంగ్రెసేతర విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆమెకు సూచించారు. కానీ మమత ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం సోనియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున కాంగ్రెస్ తరపున ప్రతినిధి హాజరు కానున్నట్లు తెలియవచ్చింది.


కాంగ్రెస్ ప్రతినిధి హాజరు నేపథ్యంలో టీఆర్ఎస్ ఏ వైఖరి తీసుకోవాలన్నదానిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో అర్ధరాత్రి వరకు చర్యలు జరిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయంలో కాంగ్రెస్‌తో కలిసి భాగస్వామ్యం కాకూడదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. పార్టీ తరఫున ప్రతినిధిని కూడా పంపొద్దని నిర్ణయించుకున్నారు.

Updated Date - 2022-06-15T16:38:11+05:30 IST