పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయానికి చేరువలో టీఎంసీ

ABN , First Publish Date - 2022-03-02T17:47:09+05:30 IST

పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చురుకుగా బుధవారం ఉదయం నుంచి సాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం..

పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయానికి చేరువలో టీఎంసీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చురుకుగా బుధవారం ఉదయం నుంచి సాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయానికి చేరువలో ఉంది. 107 మున్సిపాలిటీలలో 36 మున్సిపాలిటీలను టీఎంసీ గెలుచుకుని, మరిన్ని మున్సిపాలిటీల్లో లీడింగ్‌లో ఉందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. విపక్షనేత, నందిగామ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కంచుకోటగా చెప్పుకునే కాంతి మున్సిపాలిటీని టీఎంసీ తమ వశం చేసుకుంది. బీర్‌భుమ్‌ జిల్లాలోని అన్ని మున్సిపల్ స్థానాలతో పాటు కూచ్‌బెహర్‌లో ఐదు, సౌత్ పరగణాల జిల్లాల్లో రెండు, పూర్బ మేదినిపూర్‌లో ఒక మున్సిపాలిటీని టీఎంసీ కైవసం చేసుకుంది.  మొత్తం108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్నికలకు ముందే కూచ్‌బెహర్ జిల్లాలోని దిన్‌హట మున్సిపాలిటీలో టీఎంసీ మాత్రమే బరిలో నిలవడంతో పోటీ లేకుండానే ఆ పార్టీ గెలుపొందింది.

Updated Date - 2022-03-02T17:47:09+05:30 IST