ఆహాలో జూలై 30న మమ్ముట్టి 'వన్'

Jul 24 2021 @ 08:01AM

మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన 'వన్' మూవీ జూలై 30న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమవుతోంది. ఈ ఏడాది మార్చిలో ఆయన నటించిన రెండు సినిమాలు థియేటర్స్‌లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యాయి. ఇవి రెండు కూడా హిట్‌గా నిలిచాయి. వీట్లో 'ది ప్రీస్ట్' అనే మూవీ  మార్చి 11న రిలీజ్ అయింది. అదే నెల 26న 'వన్' మూవీ వచ్చి హిట్ సాధించింది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన 'ది ప్రీస్ట్' ఏప్రిల్‌లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. కాగా 'వన్' మూవీని తెలుగులో డబ్ చేసి, ఆహాలో ఈ నెల 30వ తేదీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పొలిటికల్ డ్రామాగా విశ్వనాథ్ దర్సకత్వంలో తెరకెక్కిన ఇందులో మమ్ముట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.