Advertisement

బాత్రూంకు వెళ్లనివ్వలేదని.. ఎయిర్‌పోర్టు అధికారి కిడ్నాప్!

Jan 16 2021 @ 22:08PM

న్యూఢిల్లీ: విమానంలో తనను బాత్రూంకు వెళ్లనివ్వలేదని ఓ డీజీసీఏ అధికారిని కిడ్నాప్ చేశాడో యువకుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ 24ఏళ్ల యువకుడు ఢిల్లీ విమానాశ్రయంలో దిగాడు. విమానం ల్యాండింగ్ సమయంలో అతను బాత్రూంకు వెళ్తానంటే సిబ్బంది ఒప్పుకోలేదట. అంతేకాకుండా అతనిపై డీజీసీఏ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి తీసుకెళ్లారట. దీంతో కొపం వచ్చిన అతను డీజీసీఏ అధికారిని కిడ్నాప్ చేసి ఓ ట్యాక్సీలో తీసుకెళ్లిపోయాడట. ఈ వింత ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. సదరు  యువకుడిని, ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on:
Advertisement