Air India విమానం కనిష్క పేల్చివేత కేసు నిర్దోషి రిపుదమన్ సింగ్ కాల్చివేత

ABN , First Publish Date - 2022-07-16T01:22:43+05:30 IST

ఎయిరిండియా (Air India) విమానం కనిష్క 1985లో 23న 329 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి మాంట్రియల్‌కు

Air India విమానం కనిష్క పేల్చివేత కేసు నిర్దోషి రిపుదమన్ సింగ్ కాల్చివేత

న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానం కనిష్క 1985లో 23న 329 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి మాంట్రియల్‌కు బయలుదేరింది. అంట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానాన్ని దుండగులు బాంబులతో పేల్చేశారు. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 329 మందీ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో  రిపుదమన్ సింగ్ మాలిక్ (Ripudaman Singh Malik), ఇందర్‌జీత్ సింగ్ రేయాత్, అజైబ్ సింగ్ బగ్రిలు ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరిలో రిపుదమన్ సింగ్ మాలిక్ 2005లో నిర్దోషిగా విడుదలయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడి పేరును బ్లాక్ లిస్ట్ నుంచి  భారత ప్రభుత్వం తొలగించింది. 


ప్రస్తుతం కెనడా (Canada)లో ఉంటున్న రిపుదమన్ సింగ్‌ హత్యకు గురయ్యాడు. 75 ఏళ్ల సింగ్‌ను గురువారం బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయనను కాల్చి చంపారు. మూడుసార్లు కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మెడ నుంచి బుల్లెట్లు దూసుకుపోవడంతో కుప్పకూలిన రిపుదమన్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది లక్షిత దాడేనని పోలీసులు తెలిపారు. 


2005లో నిర్దోషిగా విడుదలై సింగ్ 2019లో భారత్‌ను సందర్శించాడు. ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలో తీర్థయాత్రలు కూడా చేశాడు. ఇండియన్ వరల్డ్ ఫోరమ్ ప్రెసిడెంట్ పునీత్ సింగ్ చందోక్ ఈ విషయాన్ని వెల్లడించారు. రిపుదమన్ హత్యపై శిరోమణి అకాలీదళ్ ఢిల్లీ అధ్యక్షుడు, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ మాజీ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ సర్నా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  


Updated Date - 2022-07-16T01:22:43+05:30 IST