luxury gold diamond wrist watches: రూ.28 కోట్ల లగ్జరీ చేతి గడియారాల స్మగ్లింగ్

ABN , First Publish Date - 2022-10-07T16:41:47+05:30 IST

బంగారం, వజ్రాలు పొదిగిన రూ.28కోట్ల విలువైన రోలెక్స్ లగ్జరీ చేతి గడియారాల(Rolex luxury gold diamond wrist watches) స్మగ్లింగ్(smuggling) బాగోతాన్ని...

luxury gold diamond wrist watches: రూ.28 కోట్ల లగ్జరీ చేతి గడియారాల స్మగ్లింగ్

న్యూఢిల్లీ: బంగారం, వజ్రాలు పొదిగిన రూ.28కోట్ల విలువైన రోలెక్స్ లగ్జరీ చేతి గడియారాల(Rolex luxury gold diamond wrist watches) స్మగ్లింగ్(smuggling) బాగోతాన్ని ఢిల్లీ(delhi) పోలీసులు బట్టబయలు చేశారు. లగ్జరీ చేతి గడియారాలను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు(arrest) చేశారు.కస్టమ్స్ అధికారులు రికవరీ చేసిన వాచీల్లో రూ. 27.09 కోట్ల విలువైన వజ్రం ఉంది. దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తి వద్ద కోట్ల రూపాయల విలువ ఉన్న చేతి గడియారాలతోపాటు వజ్రాలు పొదిగిన బంగారు బ్రాస్‌లెట్, ఐఫోన్ 14 ప్రో 256 జీబీలను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు చెప్పారు. 


ఏడు విలాసవంతమైన రూ.28 కోట్ల చేతి గడియారాలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసినట్లు కస్టమ్స్ కమీషనర్ జుబైర్ రియాజ్ కమిలీ తెలిపారు.నిందితుడి మామకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్‌లో ఖరీదైన గడియారాల రిటైల్ అవుట్‌లెట్‌ ఉందని సీనియర్ కస్టమ్స్ అధికారి తెలిపారు.నిందితుడు  ఢిల్లీలోని ఒక ప్రముఖ క్లయింట్‌కు డెలివరీ చేయడానికి తీసుకువెళుతుండగా పట్టుకున్నామని కమిలీ చెప్పారు. 


Updated Date - 2022-10-07T16:41:47+05:30 IST