Greater Noida: ఆరు నెలలుగా సహజీవనం.. చివరకు అసలు విషయం తెలుసుకుని నివ్వెరపోయిన యువతి..

ABN , First Publish Date - 2022-08-03T21:21:49+05:30 IST

వారిద్దరికీ టీచర్ ట్రైనింగ్ సమయంలో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి, ప్రేమకు దారితీసింది.

Greater Noida: ఆరు నెలలుగా సహజీవనం.. చివరకు అసలు విషయం తెలుసుకుని నివ్వెరపోయిన యువతి..

వారిద్దరికీ టీచర్ ట్రైనింగ్ సమయంలో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి, ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం ప్రారంభించారు. ఆరు నెలల తర్వాత తాజాగా, ఆ యువతికి అతగాడి గురించి షాకింగ్ విషయం తెలిసింది. ఆ యువకుడిది వేరే మతం (Hiding Religion) అని, అతనికి అప్పటికే పెళ్లి కూడా అయిందని, అతడు తనను దారుణంగా మోసం చేశాడని తెలుసుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. గ్రేటర్ నోయిడాలో (Greater Noida) ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Viral News: కోటీశ్వరుడిగా కొద్ది గంటలు.. కూలీ ఖాతాలో రూ.2700 కోట్లు.. సంతోషంతో బ్యాంకుకు వెళితే..


 సదరు యువతి హిందూ సంప్రదాయానికి చెందినది కాగా, ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి ముస్లిం మతస్తుడు. తాను హిందువునని అబద్ధం చెప్పి ఆమెతో ప్రేమాయణం సాగించాడు. అలాగే ఆ యువకుడికి అప్పటికే వివాహం కూడా అయింది. ఆ విషయాలు బయటపడకుండా ఇన్ని నెలలు జాగ్రత్తపడ్డాడు. చివరకు విషయం బయటపడటంతో ఆ 22 ఏళ్ల యువతి షాక్‌కు గురైంది. తన మతాన్ని దాచిపెట్టి, తాను వివాహితుడిననే విషయం దాచిపెట్టి ఆ యువకుడు తనను మోసం చేసి, శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

Updated Date - 2022-08-03T21:21:49+05:30 IST