ఒక్క ఏడాదిలో రూ.66 లక్షలు వెనకేశాడు.. ఇంతకీ ఈ యువకుడు చేసిన పనేంటో తెలిస్తే..!

Published: Sat, 26 Feb 2022 12:40:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒక్క ఏడాదిలో రూ.66 లక్షలు వెనకేశాడు.. ఇంతకీ ఈ యువకుడు చేసిన పనేంటో తెలిస్తే..!

అతను ఎమ్‌బీఏ చదువుకున్నాడు.. ఓ కంపెనీ కూడా ప్రారంభించి విజయవంతంగా నడిపాడు.. అయితే లాక్‌డౌన్ సమయంలో నష్టాలు రావడంతో మూసేసి సొంతూరుకు వెళ్లిపోయాడు.. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు డేటింగ్ యాప్‌లలో కూడా ఫేక్ ప్రొఫైల్, ఫేక్ ఫొటోలతో అకౌంట్లు ఓపెన్ చేశాడు.. వాటి ద్వారా అమ్మాయిలను మోసం రూ.66 లక్షలు సంపాదించాడు. చివరకు పోలీసులకు చిక్క కటకటాల పాలయ్యాడు. 


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఆనంద్‌పాల్ అనే వ్యక్తి ఎమ్‌బీఏ చేసి కోల్‌కతాలో ఓ కంపెనీ స్థాపించాడు. అయితే లాక్‌డౌన్ సమయంలో నష్టాలు రావడంతో దానిని మూసేసి సొంతూరుకు వెళ్లిపోయాడు. అక్కడ డేటింగ్ యాప్‌లో ఓ మోడల్ ఫొటోతో వైభవ్ అరోరా అనే పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. అమ్మాయిలకు, మధ్యవయస్కులైన మహిళలకు రిక్వెస్ట్‌లు పంపేవాడు. వారు యాక్సెప్ట్ చేస్తే తన మాటలతో వారిని మాయ చేసి స్నేహం చేసేవాడు. తన తండ్రికి అనారోగ్యం అని లేదా తనకు యాక్సిడెంట్ అయిందని చెప్పి వారి నుంచి లక్షల్లో డబ్బులు తీసుకునేవాడు. 


అప్పటికే స్నేహితులైన మహిళల ప్రైవేట్ ఫొటోలను తీసుకుని వాటితో బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా దాదాపు రూ.66 లక్షలు సంపాదించాడు. అయితే రాజ్‌నగర్‌కు చెందిన ఓ ఛార్టెడ్ అకౌంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి ఆనంద్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. అతను ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసినట్టు తెలుసుకుని షాకయ్యారు. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.