మోదీ-ఇరానీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-13T21:48:04+05:30 IST

పోయిన ఏడాది జూన్‌లో చెంబూరు పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి కేసే నమోదు అయింది. ఎన్సీపీ నేత శరద్ పవార్‌ ఫొటోను అభ్యంతరకరంగా ఎడిట్ చేసిన వ్యక్తిని అప్పట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు..

మోదీ-ఇరానీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్

ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలను ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నౌపాడకు చెందిన నిందితుడిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 504, సెక్షన్ 66సీ ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు ఠాణె పోలీసులు తెలిపారు. కాగా, గడిచిన వారంలోనే సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర వ్యాప్తంగా 466 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


ఇక తాజా కేసు గురించి ఠాణె పోలీసులు మాట్లాడుతూ ‘‘జనవరి 10 ఒక వ్యక్తి 29 సెకన్ల నిడివితో ఉన్న ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. ఈ వీడియోను బీజేపీకి చెందిన ఒక నేత షేర్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బీజేపీకి చెందిన నేతలే స్వయంగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.


పోయిన ఏడాది జూన్‌లో చెంబూరు పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి కేసే నమోదు అయింది. ఎన్సీపీ నేత శరద్ పవార్‌ ఫొటోను అభ్యంతరకరంగా ఎడిట్ చేసిన వ్యక్తిని అప్పట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై ఆయన భార్యపై కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకంగా పోస్ట్‌లు పెట్టిన వారిలో పలువురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-01-13T21:48:04+05:30 IST