రక్తపు మడుగులో 56 ఏళ్ల మహిళ.. యాక్సిడెంట్ అనుకున్నారు.. పోస్ట్‌మార్టమ్‌లో వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , First Publish Date - 2022-04-12T21:08:57+05:30 IST

ఆ మహిళ వృద్ధాప్యానికి చేరువలో ఉంది.. మానసిక వికలాంగురాలైన ఆమెను కుటుంబ సభ్యులు వదిలించుకున్నారు..

రక్తపు మడుగులో 56 ఏళ్ల మహిళ.. యాక్సిడెంట్ అనుకున్నారు.. పోస్ట్‌మార్టమ్‌లో వెలుగులోకి సంచలన విషయాలు..

ఆ మహిళ వృద్ధాప్యానికి చేరువలో ఉంది.. మానసిక వికలాంగురాలైన ఆమెను కుటుంబ సభ్యులు వదిలించుకున్నారు.. దాంతో ఆమె రోడ్లపైనే జీవనం సాగిస్తూ ఆహారం దొరికినపుడు తింటోంది.. ఆమె రెండ్రోజుల క్రితం మరణించింది.. ఏదో వాహనం ఢీకొట్టడంతో చనిపోయి ఉంటుందని పోలీసులు అనుకున్నారు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. పోస్ట్‌మార్టమ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఈ నెల 6వ తేదీన 56 ఏళ్ల మహిళ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మొదట యాక్సిడెంట్‌ కేసుగా నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టంలో అసలు విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై ఎవరో అత్యాచారం చేసి చంపేశారని వైద్యులు తేల్చారు. ఆమె జననాంగంలోకి ఇనుపు రాడ్డును జొప్పించినట్టు ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


 సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఆమెను ఓ వ్యక్తి బలవంతంగా ఫ్లాట్‌లోకి తీసుకెళ్లడాన్ని గుర్తించారు. ఆ వ్యక్తిని 31 ఏళ్ల కిషన్ యాదవ్‌గా గుర్తించారు. రోడ్డుపై ఉన్న బెంచిపై పడుక్కున్న ఆ మహిళను నిందితుడు సమీపంలోని ఫ్లాట్‌కు తీసుకెళ్లి అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె జననాంగంలోకి ఇనుప రాడ్డు చొప్పించాడు. అనంతరం ఓ రాయితో ఆమె తలపై కొట్టి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2022-04-12T21:08:57+05:30 IST