పెళ్లి చేసుకుంటానని వాగ్ధానంతో బాలికను యువకుడు ఏం చేశాడంటే...

Published: Sat, 04 Dec 2021 07:26:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెళ్లి చేసుకుంటానని వాగ్ధానంతో బాలికను యువకుడు ఏం చేశాడంటే...

జమ్మూ: అభం శుభం తెలియని ఓ అమాయక బాలికను పెళ్లి చేసుకుంటానని వాగ్ధానం చేసిన యువకుడు ఆమెపై అత్యాచారం చేసిన ఘటన జమ్మూకశ్మీర్ లోని రియాసీ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు అత్యాచారం చేయడంతో బాలికను వైద్యపరీక్షకు పంపించారు. జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలం తీసుకొని నిందితుడైన యువకుడిని అరెస్ట్ చేశామని రియాసీ జిల్లా ఎస్పీ శైలేందర్ సింగ్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సబ్ ఇన్ స్పెక్టరు ర్యాంకు అధికారి నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన జమ్మూ ప్రాంతంలో సంచలనం రేపింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.